Video by via Dailymotion
Source
TDP Leaders On Karnataka Projects in Tungabhadra River : కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర నదిపై చేపట్టనున్న నిర్మాణాలను ఆపాలని టీడీపీ నేత తిక్కారెడ్డి డిమాండ్ చేశారు. తుంగభద్ర నదిపై రెండు నిర్మాణాలు చేపట్టేందుకు టెండర్లు పిలిచారని దీని వల్ల కర్నూలు జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. రాయచూరు జిల్లా చీకలపల్లి నుంచి మంత్రాలయం నియోజకవర్గం మీదుగా కుంబలనూరు వరకు బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మాణం చేపట్టేందుకు కర్నాటక ప్రభుత్వం టెండర్లు పిలించిందని గుర్తు చేశారు. దీని వల్ల తుంగభద్ర నదిపై ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టులకు నీరు ఉండవన్నారు. అలాగే తాగునీటికి సైతం ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపారు. వెంటనే ఆ పనులను ఆపాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో జగన్ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆ పార్టీ సీనియర్ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.